![]() |
![]() |
.webp)
పవిత్ర ఈ మధ్య ఫ్యామిలీ స్టార్స్ కి వచ్చిన అందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం ఈ షోకి వచ్చిన స్టార్స్ ని రోస్ట్ చేసింది. రకరకాల ప్రశ్నలు అడిగి సెటైర్స్, కౌంటర్లు వేసి నవ్వించింది. ఇక ఈ షోకి వచ్చిన సమీర్ ని, సుహాసినిని కొన్ని ప్రశ్నలు వేసింది. "సమీర్ గారు మిమ్మల్ని చూస్తుంటే ఒకటి అడగాలనిపిస్తోంది" అంటూ పాగల్ పవిత్ర ఒక ప్రశ్న అడిగింది. "సారీ నేను ఆ టైపు కాదు" అంటూ సమీర్ సీరియస్ ఫేస్ తో ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "ఐతే ఈయన్ని అడగండి" అంటూ సుధీర్ వైపు చూపించాడు సమీర్. "ఆయన వేరే టైపు" అంటూ పవిత్ర డైలాగ్ వేసింది. "మీకు రెండే రెండు అప్షన్స్ ఇస్తాను. ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఆలోచించి చేసుకోండి. భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు" అంటూ కొంచెం కామెడీ డైలాగ్స్ వేసేసరికి సమీర్ నవ్వేసాడు.
"ఫామిలీ లైఫ్ , ప్రొఫెషనల్ లైఫ్..ఈ రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోండి" అండి. "ప్రొఫెషనల్ లైఫ్" అన్నాడు. "అదేంటి ఫామిలీ లైఫ్ లేకపోతె ఎలా" అని అడిగింది. "ప్రొఫెషనల్ లైఫ్ ఉంటే ఫామిలీ లైఫ్ ఉంటుంది. ఫామిలీ లైఫ్ ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉండదు" అని చెప్పాడు. "చాలా అందంగా ఉన్నారు కదా మీ గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారు" అని అడిగింది. "మొన్నీమధ్య ఇంట్లో దొంగలు పది గర్ల్ ఫ్రెండ్ లిస్ట్ కొట్టేశారు" అని నవ్వుతూ చెప్పాడు. "కొట్టేశారు అంటున్నారు కాబట్టి ఒకటి నుంచి పది వరకు ఉండొచ్చు కదా" అంది. "పది వరకు వేసుకుంటే లిస్ట్ లు ఎందుకు బొక్క" అనేశాడు సమీర్. తర్వాత బుల్లితెర నటి సుహాసినిని పిలిచింది. "అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచినట్టు" అని అడిగింది. "నా కర్మ కాలక" అంది సుహాసిని. "మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు" అంది పవిత్ర. "అందుకే పిలిచారు" అని వెంటనే కౌంటర్ ఇచ్చింది. "సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సుహాసిని సీరియల్ హీరోయిన్ గా ఎందుకు మిగిలిపోయింది" అని అడిగింది. "ఎందుకంటే సినిమాల్లో ఆల్రెడీ చాలా గ్లామర్ ఉంది సో సీరియల్ లో గ్లామర్ లేదు కాబట్టి ఆ గ్లామర్ సీరియల్ కి చూపిద్దామని వచ్చా" అని సుహాసిని కౌంటర్ ఇచ్చింది. "ఆ సుహాసినికి వచ్చినంత పేరు ఈ సుహాసినికి వస్తుందనుకుంటున్నారా" అని అడిగింది. "ఆ పేరు రావాలనే అనుకుని చిన్నప్పుడు మా అమ్మ ఆ పేరు నాకు పెట్టింది" అంటూ చెప్పింది.
![]() |
![]() |